యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిన ఒడిశా బాలాసోర్ ఘోర రైలు ప్రమాదంపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని వివరిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక వివరాలను విడుదల చేసింది. సాంకేతికతలో లోపాల కారణంగా రాంగ్ లైన్ లో గ్రీన్ సిగ్నల్ పడిందని, ఫలితంగా ఆగి ఉన్న గూడ్స్ రైలు, మరో రైలు ఢీకొట్టిందని పేర్కొంది. కాగా, ఈ ప్రమాదంలో 295 మంది ప్రాణాలు కోల్పోయారు.