మంగళగిరి పరిధి పెదవడ్లపూడికి చెందిన కొండవీటి సుకన్య మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండుగులు లాక్కుని పారిపోయారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె తన కుమారుడు కోటేశ్వరరావుతో ద్విచక్ర వాహనంపై మంగళగిరి నుంచి పెదవడ్లపూడి వెళుతుండగా అక్షయపాత్ర సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుకన్య మెడలోని బంగారు గొలుసును తెంచుకుపోయారు. ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa