విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేలు చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా మాచర్లలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. చట్టపరంగా వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు స్వతంత్రంగా ఈ సీజేఆర్ఎఫ్ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.