గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కేసు కొట్టి వేసింది. 2015 సంవత్సరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మంగళగిరి బస్టాండ్ వద్ద ఆర్కే, మరో 14 మంది ధర్నా చేశారని అప్పట్లో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.