నరసరావుపేట మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఒ. వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని విలువైన సమయాన్ని వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.