ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇస్తాంబుల్ కు వెళ్లే విమానం ఎక్కేందుకు వెళ్తున్న ముగ్గురు తజికిస్థాన్ జాతీయుల్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. తనిఖీలు నిర్వహించగా బూట్లల్లో విదేశీ కరెన్సీని గుర్తించారు. వారి నుంచి మొత్తం రూ.10.6 కోట్లకు పైనే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కాగా, ఇంత భారీ మొత్తంలో పట్టుబడడం ఇదే మొదటిసారి.