ఈ క్రాప్ బుకింగ్ పై శనివారం కమలాపురం రైతు భరోసా కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విలేజ్ అగ్రి లెవెల్ అధికారుల సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్ సరస్వతి ఈ క్రాప్ బుకింగ్ పై అవగాహన కల్పించారు. సదస్సులో మండల వ్యవసాయ శాఖ అధికారి సరస్వతి, దస్తగిరి, సతీష్, శివ తదితరులు పాల్గొన్నారు.