పాకిస్తాన్ లో పెట్రోల్ బంకులు నేటి నుండి మూతబడనున్నాయి. పెట్రోలియం డీలర్లు నేడు సాయంత్రం నుండి బంకులు మూసేయాలని నిర్ణయించారు. దాదాపు 10 వేల పెట్రోల్ బంకు యజమానులు సమ్మెబాట పడుతున్నారు. అత్యవసర సర్వీసులకు కూడా పెట్రోల్ అమ్మబోమని తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో పాకిస్తాన్ కరెన్సీ బలహీనపడటంతో ఈ సమ్మె జరుగుతున్నట్లు తెలుస్తోంది.