పోలేరమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వెంకటగిరిలో ఐదవ విడత వైయస్ ఆర్ నేతన్న నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారు అంటే నిల బెట్టుకుంటారని అన్నారు. విద్యను ఆయుధంగా చేసుకోమని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పిలుపునిస్తే, విద్యను ఆస్తిగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని ఇది నిజం..ఇదే నిజమన్నారు.