తెలుగు దేశం పార్టీ అంటే తెలుగు డర్టీ పార్టీ, తెలుగు దుశ్సాసనుల పార్టీ, దుర్యోధనుల పార్టీ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి అభివర్ణించారు. మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. మహిళా లోకం తలదించుకునేలా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడారని విమర్శించారు. వంగలపూడి అనిత భాష అసభ్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత మాట్లాడే భాషను ఆమె పిల్లలు హర్షించరన్నారు. మహిళల పేరెత్తే అర్హతే టీడీపీకి లేదన్నారు. సైకో పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని, మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. మహిళలను అవమానించిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, నారాయణ ఇంటి ముందు అనిత దీక్షలు, ధర్నాలు చేయాలని సూచించారు.