దేశ రాజధాని ఢిల్లీలో రెండు మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని, నిర్ణీత సమయంలో ఆక్రమణలను తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఢిల్లీలోని బెంగాలి మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు నార్తర్న్ రైల్వే అధికారులు నోటీసులిచ్చారు.