ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ బాబుకు గతంలో ఓ మహిళతో పెళ్లైంది. తర్వాత వారు విడిపోయారు. వరమ్మ అనే మహిళను ఐదేళ్ల క్రిందట ఆయన వివాహం చేసుకున్నాడు. మాజీ భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ భార్యకు ఆనంద్ శుక్రవారం దొరికాడు. దీంతో భర్తతో గొడవ పడింది. కోపంలో బ్లేడ్‌తో భర్త మర్మాంగాన్ని ఆమె కోసింది. బాధితుడు నందిగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.