మహారాష్ట్రతో పాటు మణిపూర్లో బీజేపీ పాలన వల్ల హింస చెలరేగుతోందని శివసేన (UBT) ధ్వజమెత్తింది. మణిపూర్ ఫైల్స్ పేరుతో బీజేపీ సినిమా తీయాలని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ల తీరుపై సామ్నా పత్రిక సంపాదకీయంలో తీవ్రంగా విమర్శలు గుప్పించింది. 'ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న హింస, దౌర్జన్యాలు కాశ్మీర్ కంటే దారుణంగా ఉన్నాయని పేర్కొంది.