రోడ్లపై గుంతలు పూడ్చలేని కైలే అనిల్ కుమార్కు ఒక్క రోజు కూడా ఎమ్మెల్యే గా కొనసాగే అర్హత లేదని కూచిపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వర్ల కుమార్ రాజా ధ్వజమెత్తారు. కాజ గ్రామంలో శుక్రవారం పర్యటించి అధ్వాన రహదారుల్లో ప్రజలు పడుతున్న అవస్థలను పరిశీలించారు. కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయి రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. మొవ్వలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమగ్ర ఓటరు సర్వే సందర్భంగా సమీక్ష నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి దొంగ ఓట్ల తొలగింపుకు చర్యలు చేపట్టాలన్నారు. లింగమనేని రామలింగేశ్వరరావు, యార్లగడ్డ శ్రీనివాసరావు, వీరాస్వామి, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.