కొంతకాలంగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి చిత్తూరుతో పాటు పరిసర మండలాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు వాహనాల తనిఖీ, చెక్‌పోస్టుల్లో నిఘాను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కళ్లుగప్పి శుక్రవారం తిరుపతి- బెంగళూరు పాత బైపాస్ రోడ్డులోని మురకంబట్టుకు వెళ్లే దారిలో ఓ కారు వచ్చింది. ఆ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా, కర్ణాటక మద్యం బయటపడింది. కారులో ఉన్న చిత్తూరు నగరం తేనబండ దళితవాడకు చెందిన ఎస్.తులసీరామ్(29)ను అదుపులోకి తీసుకోగా, నిందితుడి అన్న జయశంకర్ తప్పించుకున్నాడు. దాంతో రూ. 5లక్షల విలువ చేసే కారును, రూ.2 లక్షల విలువైన 50 కేస్‌ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తులసీరామ్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ మద్యాన్ని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఐడీ పార్టీ రాజ్‌కుమార్, సుధాకర్, పోలీసులను డీఎస్పీ అభినందించారు.