పవన్‌పై పరువు నష్టం కేసు వేయడానికి ఆయన మీ పరువుకు నష్టం వాటిల్లే దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రశ్నించారు. ‘‘గడిచిన నాలుగన్నారేళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మీరు ఏమి పరువు మిగిల్చారో చెప్పండి జగన్ గారు..?. రాజధాని ఎదో చెప్పుకోలేక, పరిశ్రమలు లేక ఉద్యోగాల కోసం పరాయి రాష్ట్రాలకు వెళుతున్న దుస్థితికి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలు అవమానంతో వెయ్యాలి మీ మీద పరువు నష్టం అని ఆగ్రహం వ్యక్తపరిచారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న అవ్వ, తాతల వెయ్యాలి మీద పరువు నష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కానీ.. ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఒక పోలీస్ రిక్రూట్మెంట్ లేక ఆశతో ఎదురు చూపులు చూస్తూ మోసపోయిన నిరుద్యోగులు వెయాలి పరువు నష్టం దావా’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.