ఏపీలో పాఠశాలల కాంట్రాక్ట్ బైజూస్ సంస్థకు ఇవ్వడాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. టీచర్ రిక్రూట్ మెంట్ లేదు. కానీ నష్టాలు వచ్చే స్టార్టప్ కి రూ.కోట్లలో కాంట్రాక్ట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించిందా?. ట్యాబ్స్ మంచివే. కానీ, ముందుగా పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాలి. అన్ని స్కూళ్లలో టీచర్స్ తప్పనిసరిగా ఉండాలి.’ అని పవన్ హితవు పలికారు.