ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిగామలో దారుణ ఘటన,,,,భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2023, 06:44 PM

మొదటి భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఆమె రీల్స్ చూస్తున్నాడనే కోపంతో రెండో భార్య బరితెగించింది. భర్త మర్మాంగాలను బ్లేడ్‌తో కోసేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు గతంలో ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్యతో విబేధాలు రావడంతో మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మరో మహిళను ఆనంద్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు తన గ్రామమైన ముప్పాళ్లలో రెండో భార్యతో కలిసి ఉండగా.. ఐదు నెలల క్రితం నందిగామలోని అయ్యప్పనగర్‌కు వచ్చాడు. ఇక్కడే భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.


అయితే గత కొంతకాలంగా ఆనంద్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొదటి భార్య రీల్స్‌ను చూస్తున్నాడు. గత రాత్రి మొదటి భార్య వీడియోలు చూస్తుండగా రెండో భార్య దీనిని గమనించి ఆనంద్ బాబును నిలదీసింది. తనను పెళ్లి చేసుకుని మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నారంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో భార్యాభర్తలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ మరింత పెరగడంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన మహిళ.. బ్లేడ్‌తో ఆనంద్ బాబు మర్మాంగాలను కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా.. స్థానికులు బాధితుడిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం ఆనంద్ బాబును విజయవాడకు తరలించారు.


శుక్రవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లం గుట్ట తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ముద్దు పెట్టినందుకు భర్త తారాచంద్ నాయక్ నాలుకను భార్య పుష్పవతి కోసేసింది. దీనిపై జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. బాధితుడు ప్రస్తుతం అనంతపురంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. ఈ సమయంలో భార్యకు ముద్దు పెట్టేందుకు భర్త ప్రయత్నించాడు. దీంతో కోపంలో భర్త నాలుకను కోసి అమానుషానికి పాల్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com