మహారాష్ట్ర నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా పొహనె షివార్ గ్రామంలో 9 ఏళ్ల బాలుడిని బలిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిధి దొరుకుతుందనే ఆశతో గ్రామానికి చెందిన నలుగురు బాలుడిని నిర్బంధించి తాంత్రిక పూజల్లో భాగంగా గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని గుంతలో సగం వరకూ పూడ్చిపెట్టారు. ఈ నెల 18న ఈ దారుణం వెలుగుచూడగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.