ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ప్రకటన విడుదల చేశారు.