మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ నోటీసుకు హైకోర్టుకే వెళ్లి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో సాగే లీగ్ మ్యాచుల్లో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎన్డీసీఏ) జట్టు ఆడేందుకు గతంలో అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ నిరాకరించాడు. దీంతో ఎన్డీసీఏ హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.