ఏపీలోని పల్నాడు జిల్లా నరసారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మోపువారిపాలెంలో స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా గుర్తించారు. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.