ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐసీయూ వార్డులో రోగులు మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం తోసిపుచ్చేందుకు ప్రయత్నించింది. ఇతర కారణాల వల్ల మరణాలు సంభవించాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధా నాయక్ నివేదికలో తెలిపారు. కొందరు కావాలనే ఆస్పత్రిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa