నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని ఫిర్యాదు రావడంతో పల్నాడు జిల్లా కారంపూడిలో శ్రీకర్షక్ సీడ్స్ దుకాణం పై పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి మురళి శనివారం అర్ధరాత్రి మెరుపు దాడి చేసి తనిఖీ నిర్వహించారు. అదేవిధంగా దుకాణంలో ఉన్న రికార్డులను వ్యవసాయ అధికారి మురళి పరిశీలించారు. ఈ దుకాణంలో కల్తీ విత్తనాలు అమ్ముతున్నారని పలు ప్రాంతాల రైతులు నుండి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మురళి తెలిపారు.