రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 24 వ తేదీన తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్న నేపధ్యంలో ఏర్పాట్లను శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పరిశీలించారు. సజ్జల మాట్లాడుతూ రానున్న రోజుల్లో 50 వేల ఇల్లు, కుటుంబాలు ఏర్పడతాయని, 25 ఊళ్ళు వస్తాయని వేలాది కుటుంబాలతో కాలనీలు కళకళలాడుతూ ఉంటాయన్నారు.