వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని స్థానిక ఎంపీపీ చౌడేశ్వరి కోరారు. శనివారం దుర్గి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. సర్పంచులు, కార్యదర్శులు గ్రామాలలో తిరిగి మురుగు నిల్వ లేకుండా చూడాలి. పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో కాల్వలలో పూడిక తీయటం, చెత్త కుప్పలను వెంటనే తొలగించటం చేయాలని కోరారు.