కర్నూలు జిల్లా మంత్రాలయం శివార్లలో రూ.300 కోట్లతో నిర్మించనున్న 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపనతో మంత్రాలయం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సుబుధేంద్ర తీర్థులు, 'జై శ్రీరామ్ ఫౌండేషన్' వ్యవస్థాపకులు రాము, శ్రీధర్, మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.