2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రచారానికి రూ.3,064.42 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ గత వారం రాజ్యసభకు అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019-19 నుంచి జూలై 2023 వరకు ప్రింట్ మీడియాపై రూ.1,338.56 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.1,273.06 కోట్లు, బహిరంగ ప్రచారానికి రూ.452.80 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.