రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రకటించారు. బస్సులు, లారీలు, లోడ్ వాహనాలు గామన్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. భారీ వాహనాల వల్ల రోడ్డు కం రైలు వంతెన గడ్డర్లు, డెక్ జాయింట్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ బ్రిడ్జిపై ఇకపై కేవలం బైకులు, కార్లు, ఆటోలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa