పేపర్ బాయ్, ప్రొక్లెయిన్ ఆపరేటర్ కే.అఖిల్ (28 ఏళ్లు)కు కేరళ సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు వరించింది. రచనా వ్యాసంగంపై తనకున్న మక్కువతో అఖిల్ రాసిన పొట్టి కథల పుస్తకం ‘నీలచడయాన్’కు ఈ అవార్డు లభించింది. ఇడుక్కి జిల్లాలో పెరిగే గంజాయి జాతి మొక్కల స్ఫూర్తితో తన పుస్తకానికి అఖిల్ ఈ పేరు పెట్టాడు. మూకాభినయం, నృత్యం, సంగీత సాధకుల కష్టాలను కథలుగా మలిచాడు.