ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఇ-రేడియేషన్ ప్రక్రియతో ఉల్లిపాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయనున్నారు. ఇందుకోసం గామా, ఎక్స్, ఎలక్ట్రాన్ కిరణాలను వినియోగిస్తారు. ఫలితంగా ఉల్లిపాయల్లో ఉండే సూక్ష్మజీవులు, కీటకాలు నశిస్తాయి. నిల్వ సామర్థ్యం పెరిగి ధరలు నిలకడగా ఉంటాయి. నాణ్యత, రుచి తదితర విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.