పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి ఇశాక్ డార్ పేరును అధికార ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ పరిశీలిస్తోంది. ఇటీవల ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలు, విదేశీ పెట్టుబడులను రాబట్టుకోవాలంటే ఇది అనివార్యమని పార్టీ భావిస్తోంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. అలాగే తాత్కాలిక ప్రధానిగా ఆర్థికశాఖ మాజీ మంత్రి హఫీజ్ షేక్ పేరు కూడా పరిశీలన ఉంది.