ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీజేపీ లక్ష్యమని, అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆ పార్టీ రాయలసీమ జోనల్ సమావేశం నిర్వహించారు. పురందేశ్వరికి డప్పు వాయిద్యాలు, బాణసంచాల మధ్య పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.