మహారాష్ట్రలోని పూణె పట్టణంలో ఓ పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి తాను కాల్చుకుని చనిపోయాడు. అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా విధులు నిర్వహిస్తున్న భరత్ గైక్వాడ్ బానర్ ప్రాంతంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భరత్ సోమవారం తుపాకీతో తన భార్య మోని గైక్వాడ్ (44), మేనల్లుడు దీపక్ (35)ను తుపాకీతో కాల్చి చంపి తాను చనిపోయాడు. అయితే ఎందుకు కాల్చి చంపారనే విషయంపై క్లారిటీ లేదు.