వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్లు నరకడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు సోమవారం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా చెట్లు నరికడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చెట్లు నరికిన ఫొటోలను సోమవారం పవన్ కళ్యాణ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. విచక్షణారహితంగా చెట్లు నరకవద్దని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పాలన్నారు.
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని.. అలాంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. తమిళనాడులో చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు. ఈ సందర్భంగా జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘పుష్ప విలాపం’ పద్యాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
‘‘ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ ...’’ అనే పద్యాన్ని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.