కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు గుర్తుతెలియని వ్యక్తుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పలువురు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు ఉద్యోగిని కూడా చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయి. దీనిపై హైకోర్టు పీఆర్వో మురళీధరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జూలై 12వ తేదీ రాత్రి 7 గంటలకు మురళీధరన్‌కు అంతర్జాతీయ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చిందని పోలీసులు తెలిపారు.