ఏపీ అప్పుల విలువ రూ.2.64 లక్షల కోట్లు అని కేంద్రం వెల్లడించింది. బీఆర్ఎస్ సభ్యుడు నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఏపీ అప్పులపై లోక్ సభలో వివరాలు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలు తెలిపింది. 2019-20 నుంచి 2022-23 వరకు తీసుకున్న అప్పుల వివరాలను వివరించింది. 2019 మార్చి నాటికి ఏపీ అప్పుల విలువ రూ.2.64 లక్షల కోట్లు అని పేర్కొంది. 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు విలువ రూ.4.42 లక్షల కోట్లు అని వెల్లడించింది. ఈ మేరకు నామా నాగేశ్వరరావు ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.