చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమంద గ్రామానికి చెందిన పి.చంద్రమౌళి, అతడి సోదరుడు మురళి కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. వీరికి కరకమందలో 12 ఎకరాలు, సువ్వారపుపల్లెలో 20 ఎకరాల పొలం ఉంది. ఇందులోని 22 ఎకరాల్లో ఏళ్ల తరబడి టమాటా పంటను సాగు చేస్తున్నారు. ఈ సారి జూన్, జులైలో దిగుబడి వచ్చేలా టమాటాలను సాగు చేశారు. టమాటాల ధరలు భారీగా పెరగడంతో నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని చంద్రమౌళి చెప్పాడు.