లివర్ సమస్యల్ని ప్రాథమిక దశలోనే తెలుసుకునేందుకు మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కేర్ వెల్ హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. షేక్ నాగూర్ బాషా తెలిపారు. గుంటూరు నగరం గుంటూరువారితోట 7వ లైనులోని తమ హాస్పిటల్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న శిబిరంలో ఒక్కొక్కరికీ రూ. 10వేల విలువైన ఫైబ్రో స్కాన్ పరీక్షను ఉచితంగా చేస్తున్నామని పేర్కొన్నారు.