మేఘాలయా సీఎం కన్రాడ్ సంగ్మా కార్యాలయంపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో తురాలోని సీఎం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తురాను రాష్ట్ర శీతల రాజధానిగా మార్చాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తూ సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు స్పందించి అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.