తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న అనితపై ఓ పత్రికలో అసభ్యకరంగా వచ్చిన కథనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పత్రిక ప్రతినిధి ఇంటి ముందు ధర్నా చేసింది. దాంతో ఆ పత్రిక ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అనిత, సౌమ్యలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa