పాలస్తీనాలోని గాజాలో సుమారు 2 వేల ఏళ్లనాటి సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గతేడాది వెలుగు చూసిన పురాతన రోమన్ శ్మశాన వాటికలో తవ్వకాలు జరుపుతుండగా ఇవి వెలుగులోకి వచ్చాయి. మొత్తం 125 సమాధులను గుర్తించామని, వీటిలో రెండు శవపేటికలపై వివరాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. వివరాలు ఉన్న శవపేటికలపై ద్రాక్షలు, డాల్ఫిన్లు ఉన్న చిత్రాలున్నాయని వెల్లడించారు. వీటిని సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు పరిశోధకుడు ఫదెల్ తెలిపారు.