ఏకో విశాఖ స్వచ్ఛ సర్వేక్షన్ -2023 లో భాగంగా నగరంలో డెంగ్యూ మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమల వృద్దిని అరికట్టే గంబుషియా చేపల పెంపకాన్ని మరింత వృద్ధి చేయాలని నగర డిప్యూటి మేయర్ జియ్యని శ్రీధర్ అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 52వ వార్డు గౌరీనగర్ పారిశుధ్య కార్యాలయం దగ్గర ఉన్న నీటినినిల్వచేసే ప్రదేశంలో సోమవారం గంబుషియా చేపలను విడుదల చేసారు. గంబుుషియా చేపల పెంపకం ద్వారా దోమల లార్వాను అంతం చేయవచ్చన్నారు.