ఏపీకి అమరావతి రాజధాని అన్న విషయానికే బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వరీ తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, రైల్వేలు, పోర్టులకు అధికమొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని.. వారిపై జరిగిన దాడులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.