మంగళవారం జలాశయం నీటిని విడుదల చేసారు. వంగర మండలం మడ్డువలస జలాశయ పథకం గత 20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదు. మరమ్మత్తులకు గాను ప్రభుత్వం కోటి 80 లక్షల రూపాయలు, ఎంపీ నిధుల నుంచి రూ. 8 లక్షలు మంజూరు అయ్యాయి. మరమ్మతులు పూర్తిచేసి కాలువలోకి నీటిని మంగళవారం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్ విడుదల చేసారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు.