మనస్తాపంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మంగళగిరి నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు బీటెక్ పస్ట్ ఇయర్ లో చేరేందుకు పశ్చిమబెంగాల్ నుంచి సౌరదీప్ (20) తాడేపల్లి వచ్చారు. తనకు ఇక్కడ చదవడం ఇష్టం లేదని తండ్రికి ఫోన్ చేసి చెప్పగా ఇద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. అనంతరం మనస్థాపంతో హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.