భారతీయ రైల్వేకు టిక్కెటింగ్, క్యాటరింగ్, పర్యాటక సర్వీసులను అందించే దేశీయ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐఆర్సీటీసీ(IRCTC) అధికారిక వెబ్సైట్లో ఇవాళ ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన ఐఆర్సీటీసీ. కొన్ని రకాల సాంకేతిక కారణాల వల్ల వెబ్సైట్ పని చేయడం లేదని, వీలైనంత త్వరగా సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపింది.