మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ ఉభయసభల్లో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఆయన మౌనం పట్ల ఆగ్రహంగా ఉన్న విపక్షాలు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిగా ఏర్పడి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.