జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్‌కు వ్యతిరేకంగా ఇవాళ జనసైననికులు విజయవాడలో నిరసనకు దిగారు. ఈ క్రమంలో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు మంత్రి జోగి రమేశ్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, మంత్రికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.