మంత్రి జోగి రమేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు జనసేన నేతలు కార్యకర్తలు, వీరమహిళలు ఆందోళనకు దిగారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో పిచ్చి కుక్క జోగి రమేష్ అంటూ జనసేన వీర మహిళలు మంత్రి బొమ్మని చెప్పులతో కొట్టారు. జోగి రమేష్ దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే దిష్టి బొమ్మను పోలీసులు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులని పోలీసులు అరెస్టు చేశారు.